మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కాస్త నిరాశ కలిగించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది అదేమంటే ఆయన తదుపరి చిత్రం #MEGA158 ప్రారంభోత్సవ షెడ్యూల్‌లో కొన్ని అనివార్య మార్పులు చోటుచేసుకున్నాయని. వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో తన 158వ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ఆ ప్లాన్ ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జనవరి 18న నిర్వహించి, ఫిబ్రవరి నుంచి…