మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కాస్త నిరాశ కలిగించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది అదేమంటే ఆయన తదుపరి చిత్రం #MEGA158 ప్రారంభోత్సవ షెడ్యూల్‌లో కొన్ని అనివార్య మార్పులు చోటుచేసుకున్నాయని. వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో తన 158వ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ఆ ప్లాన్ ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జనవరి 18న నిర్వహించి, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ప్లాన్ మొత్తం మారిపోయిందని అంటున్నారు సినిమా ఈ చిత్ర ప్రారంభోత్సవం వాయిదా పడటానికి ప్రధాన కారణం చిరంజీవికి ఇటీవల జరిగిన మోకాలి శస్త్రచికిత్స. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న చిరు, తన పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇటీవల సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
Also Read :Jana Nayagan : జననాయగన్ ‘భగవంత్ కేసరి’ రీమేకే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో, వైద్యుల సలహా మేరకు షూటింగ్‌ను కాస్త వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం, #MEGA158 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఫిబ్రవరి నెలలో జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభించనున్నారు. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక రస్టిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అని, ‘వాల్తేరు వీరయ్య’లో చిరును వింటేజ్ మాస్ లుక్‌లో చూపించిన బాబీ, ఈసారి అంతకు మించి ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ “The blade that set the bloody benchmark” అనే ట్యాగ్‌లైన్‌తో అంచనాలను ఆకాశానికి అంటేలా చేసింది. ఇక సంక్రాంతి రేసులో ‘మన శంకర వరప్రసాద్ గారు’తో సందడి చేయనున్న మెగాస్టార్, ఆ తర్వాత పూర్తిగా కోలుకుని మార్చి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు.