యూట్యూబర్ పూల చొక్క నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని నవీన్‌పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా..రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్.
మన టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ల పరభాష భామల మోజు గురించి అందరికీ తెలిసిందేగా! ఎంత ఖర్చైనా పర్లేదు.. ఇతర రాష్ట్రాల నుంచి కథానాయికల్ని ఇంపోర్ట్ చేసుకుంటారే తప్ప, లోకల్ ట్యాలెంట్‌ని పెద్దగా పట్టించుకోరు. ఇబ్బడిముబ్బడిగా వాళ్ళు విచిత్రమైన డిమాండ్స్ చేసినా సరే, వాటిని తీర్చేందుకు సిద్ధమైపోతారు. మనోళ్ళ ఈ వీక్నెస్ చూసే.. పరభాష భామలు క్యాష్ చేసుకుంటుంటారు. సరిగ్గా మానుషీ ఛిల్లర్ కూడా అదే చేయాలనుకుంది. ఆఫర్స్ కోసం తనని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి, భారీగా దండుకోవాలని చూసింది.…