Waqf amendment bill: ఎన్డీయే ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’కు మిత్ర పక్షాల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే, టీడీపీ, జనసేన పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇంఛార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కార్యాచరణపై లోకేష్ మంత్రులతో చర్చించారు.