యంగ్ హీరోయిన్ శ్రీ లీల టైం ఏమాత్రం బాగాలేదు. ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న ఏకైక బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గతంలో కొంత భాగం జరిగింది. 2023లో షూటింగ్ మొదలైనప్పుడు శ్రీలీల కూడా పాల్గొంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ సినిమా పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ అద్భుతమైన విజువల్ ట్రీట్‌ను అందించనుంది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. ఆయన బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్…
Gaddar Awards: తెలుగు చిత్రసీమలో మరోసారి సినీ అవార్డులతో వేదిక వెలుగులు నింపనుంది. 14 సంవత్సరాల విరామం తర్వాత ఉత్తమ తెలుగు సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఒక మహత్తరమైన గౌరవంగా భావిస్తున్నారు తెలంగాణ సినీ ప్రేమికులు. ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు ఘనంగా జరిగింది. తెలుగు ప్రజలు ఈ రోజును సందడిగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ…
యూరప్ హాలిడే కోసం వెళ్ళిన ప్రభాస్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చి రాగానే హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఫౌజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్వాతంత్ర్యానికి పూర్వం రాసుకున్న కథతో తెరకెక్కిస్తున్నారు. ఒక పీరియాడిక్ సెటప్ సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రభాస్ మీద కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు సినిమా టీం. Also Read:OG Shooting: OG షూటింగ్లో పవన్…
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్…
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలో తొలుత బంద్ ప్రకటన వెలువడిన క్రమం తదితర అంశాల మీద ఏపీ డిప్యూటీ సీఎం అధికారులతో చర్చించారు. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన…
నారా రోహిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామమూర్తి నాయుడు కుమారుడైన రోహిత్ సినిమాల మీద ఆసక్తితో ఎప్పుడో బాణం అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత చేసిన సోలో ఇలాంటి సినిమా ఆయనకు మంచి హిట్ వచ్చింది. ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నీ వైవిధ్యంగా ఉన్నా ఎందుకో హిట్స్ అందుకోలేకపోయాడు. Also Read:Kamal Hasan : త్వరలోనే పహల్గాంకు వెళ్తా..…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. . ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా…
అడవి శేష్ తాజా చిత్రం ‘డెకాయిట్’ ఆడియో రైట్స్ రూ. 8 కోట్లకు సోనీ మ్యూజిక్ కొనుగోలు చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో, మరో ఆసక్తికరమైన చిత్రం ‘నిలవే’ గురించి సమాచారం అందుబాటులోకి వచ్చింది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ‘నిలవే’ చిత్రం ఒక మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందుతోంది. సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై,…