టాలీవుడ్‌లో తెలుగు ముద్దగుమ్మలకు కొదవ లేదు. అయితే అందులోనూ అంజలి గురించి పరిచయం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు సినిమాతో తెలుగు తనం ఉట్టిపడేలా పరికినీతో అందరి దృష్టి ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటించిన ప్రతి పాత్రలోనూ ప్రాణం పోసినట్లుగా నటించేస్తుంది. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి పేరును తన సొంతం చేసుకుంది. తెలుగు తనం…
రాజోలు చిన్నది, అచ్చతెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ నెల 1వ తేదీకి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యింది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఫోటో’ సినిమా పదిహేనేళ్ల క్రితం అంటే 2006 సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ సందర్భంగా ఈ పదిహేనేళ్ళలో అంజలి వివిధ చిత్రాలలోని పోషించిన పాత్రలతో ఓ పోస్టర్ ను చేశారు. దీనిని అంజలి ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దానితో పాటే… ‘నాకు తెలుసు, నేను పార్టీకి ఆలస్యంగా వచ్చానని,…
(జూన్ 16న నటి అంజలి పుట్టినరోజు)మునుపటిలా తెలుగమ్మాయిలు చిత్రసీమలో రాణించలేకపోతున్నారు- ఈ మాట చాలా రోజులుగా తెలుగు చిత్రసీమలో వినిపిస్తూనే ఉంది. నిజానికి సినిమా రంగంలోని పరిస్థితుల కారణంగా అయితేనేమి, ఇతరత్రా అయితేనేమి తెలుగు అమ్మాయిలు అంతగా నటనారంగంవైపు ఆసక్తి చూపించడం లేదు. ఆ సమయంలో శివనాగేశ్వరరావు తెరకెక్కించిన ఫోటో చిత్రంతో అచ్చతెలుగు అమ్మాయి అంజలి పరిచయమయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించిన అంజలి రాగానే తనదైన అభినయంతో ఆకట్టుకుంది. రాజోలు పాప భలే చేస్తుంది…