5G Towers: టెలీకమ్యూనికేషన్ కంపెనీలు ప్రస్తుతం వారానికి 2 వేల 5 వందల 5జీ టవర్లను మాత్రమే ఏర్పాటుచేస్తుండగా ఆ సంఖ్యను వారానికి కనీసం 10 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 వేల టవర్లను మాత్రమే ఇన్‌స్టాల్ చేశారని, 5జీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో టెల్కోలకు ప్రభుత్వం నుంచి పాలసీకి సంబంధించిన ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.