రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు జరిగిన అన్యాయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ “అబద్ధాల పుట్టా” అని ఆమె వ్యాఖ్యానించారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలేవి..? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు..ఆ సంగతేంది..? అని ఆమె అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి.. మరి వాటి ప్రతిపాదనలేవి..? నిధులెక్కడ..?…