Aqua Hub: రాజన్న సిరిసిల్లలోని మిడ్ మానేర్ డ్యామ్ వద్ద తెలంగాణ త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మంచినీటి ఆక్వా హబ్కు నిలయం కానుంది. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ట్విట్ చేశారు.
భోగాపురం ఎయిర్పోర్ట్కు సీఎం జగన్ శంకుస్థాపన.. విశేషాలు ఇవే.. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ తర్వాత రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు…
Neera cafe: ట్యాంక్ తీరంపై ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా.. పక్కనే కొత్త సచివాలయం ఏర్పాటైంది. కాగా.. ఇప్పుడు నీరా కేఫ్ కూడా సిద్ధమైంది. నగరవాసులకు నోరూరించే తీపి నీరాను అందించి పరిశ్రమ స్థాయికి నీరాను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం 'నీరా కేఫ్'ను ఏర్పాటు చేసింది.
సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ దృష్టి సారించిన ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో భాగమైన సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ (SSMPP)కి పర్యావరణ క్లియరెన్స్ (EC) ఇతర అవసరమైన అనుమతులను అధికారుల నుండి త్వరలో పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం (CWC), కేంద్ర పర్యావరణ & అటవీ మంత్రిత్వ శాఖకు పంపిన ప్రాజెక్ట్ తాజా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) అన్ని సంభావ్యతలలో, పర్యావరణ…
Papikondalu Tour Cancel: వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో వానలు కురుస్తున్నాయి.. వడగాలులు వీయాల్సిన వేళ.. ఈదురుగాలులు వణికిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది.. ఇప్పటికే పలుమార్లు.. పాపికొండల టూర్ వాయిదా పడగా.. ఇప్పుడు మరోమారు బ్రేక్ పడింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ…
కలకలం రేపిన ఈ-మెయిల్.. తిరుమలలో హై అలర్ట్.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఏడుకొండలపై ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు వచ్చిన ఓ సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేసింది.. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.. ఇక, తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు నిజమేనా అని తేల్చే పనిలో భాగంగా సీసీ…