Citroen Aircross: సిట్రోన్ ఇండియా తన Aircross, C3 మోడల్స్‌లో కొత్త వేరియంట్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వినియోగదారుల డిమాండ్‌ను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, బుకింగ్ ఆధారిత ఉత్పత్తి విధానాన్ని అమలు చేయడానికి దోహదపడుతుంది. ఈ వ్యూహం ద్వారా నిజమైన కస్టమర్ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తులు అందించబడతాయి. డీలర్ల దగ్గర నిల్వను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుని.. కస్టమర్ ఆర్డర్ల ప్రకారం మాత్రమే ప్రత్యేక వేరియంట్లు ఉత్పత్తి చేయబడతాయి.
ఇక, Aircross X Max Turbo 5-సీటర్, C3 Live (O) వేరియంట్లు ఈ వ్యూహంలో తొలి ఉత్పత్తులుగా లాంచ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్లు ఇప్పటికే బుకింగ్‌కి అందుబాటులో వచ్చాయి. Aircross X Max Turbo 5-సీటర్ MT ధర రూ. 12.41 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, C3 Live (O) ధర రూ. 5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ వేరియంట్లలో ఎలాంటి మెకానికల్ మార్పులు లేవు. అలాగే, Aircross X Max Turbo 5-సీటర్ ప్రత్యేకంగా థార్డ్ రో కంటే ఎక్కువ సెకండ్ రో కాఫీ స్థలం కోరుకునే కస్టమర్ల కోసం డిజైన్ చేయబడింది.
Read Also: Cyber Scam: అమెరికా కల చూపి.. భారతీయ మహిళతో రూ.16 లక్షలు కొట్టేసిన రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్?
అయితే, 7-సీటర్ మోడల్‌తో పోలిస్తే, ఈ 5-సీటర్ మోడల్ బ్యాక్‌సీట్లో కాలి స్థలాన్ని 60 మిల్లిమీటర్లు ఎక్కువగా అందిస్తుంది. రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో కప్ హోల్డర్స్ ఉంటాయి. అలాగే, రియర్ సీట్స్ మూడు దశల రీక్లైన్ ఫీచర్ కలిగి ఉంది. ఈ వేరియంట్ మూడు రంగులలో అందుబాటులో వచ్చింది. పోలార్ వైట్, డీప్ ఫారెస్ట్ గ్రీన్, పర్లా నెరా బ్లాక్, ఇవన్నీ డార్క్ బ్రౌన్ ఇంటీరియర్స్‌తో ఉంటాయి. కాగా, C3 Live (O) వేరియంట్, స్టాండర్డ్ Live ట్రిమ్ కంటే ఎక్కువ ఫీచర్లతో ఉన్న వెర్షన్‌గా పరిచయం అయింది.
Read Also:
అలాగే, ఇందులో లెదరేట్ సీట్స్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, రియర్‌వ్యూ కెమెరా వంటి 10కి పైగా అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌లో కూడా చిన్న మార్పులు చేశారు. కొత్త వీల్ కవర్లు, అదనపు క్లాడింగ్ ఉన్నాయి. Live (O) వేరియంట్ ప్రత్యేకంగా పర్లా నెరా బ్లాక్ రంగులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిట్రోన్ ఇండియా కొత్త వ్యూహం ద్వారా కస్టమర్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తులను అందిస్తూ, వినియోగదారులకు అనుకూలమైన మోడల్స్‌ను అందించడంలో ముందంజ వేసింది.