భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం మీద ఆయన ఆరా తీసుకున్నారు.
తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని, ప్రతిపక్షాల అభ్యర్థిని అని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని స్పష్టం చేశారు. రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది తనను అడిగారని చెప్పారు. తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, ఏ పార్టీలో సభ్యత్వం లేదని, ఇక ముందు కూడా ఉండదని పేర్కొన్నారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం…
ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని.. తెలుగు వారు అందరూ ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపుకు నిలబడాలిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అసదుద్దీన్.. ఆయన గెలుపుకు కృషి చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు. సుదర్శన్ రెడ్డి గెలుపు వల్ల మన తెలుగువారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని సీఎం…
కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్…
ఢిల్లీ – తెలంగాణలో లోకల్ కోటా కింద ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంటున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి. స్థానికత అంశంపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వరుసగా 9 ,10, 11,12 తరగతులు చదువితేనే లోకల్ అంటూ స్పష్టం చేసింది. అయితే ఈ రూల్స్ లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుందనే షరతు పెట్టింది సుప్రీం కోర్ట్. లోకల్ రిజర్వేషన్ అంశంపై తెలంగాణకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వరుసగా నాలుగేళ్లు…
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ల లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు…
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంకు అనుమతి తప్పనిసరి అని జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సాధారణ సమ్మతి (General Consent)ని రద్దు చేసింది. అంటే.. సీబీఐకి దర్యాప్తు కోసం రాష్ట్రంలో ప్రవేశించేందుకు ప్రతి కేసులో ప్రత్యేక అనుమతి అవసరం. ఈ నిర్ణయం జీవో ఎంఎస్ నెం.51 ద్వారా 30 ఆగస్టు 2022న జారీ చేయబడింది. ఈ జీవో ప్రకారం.. గతంలో ఇచ్చిన సాధారణ అనుమతులు అన్నీ రద్దు చేయబడ్డాయి. ఈ…
స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తెలంగాణలో వరుసగా 9 , 10, 11, 12 తరగతులు చదువుతేనే లోకల్ అంటూ తీర్పు వెలువురించింది సుప్రీంకోర్టు.. దీంతో, తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో ప్రభుత్వానికి ఊరట దక్కినట్టు అయ్యింది..
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం విషయంలో మొదటి నుంచీ సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్ చేశాం అని, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు అండగా ఉండి విచారణను ఆలస్యం చేసిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిజం ముందు తలవంచి.. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి అంగీకరించిందని పేర్కొన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లపై అసెంబ్లీలో సిట్ విచారణ ప్రకటించిన…