తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు.
చట్టాన్ని కాపాడేవాడు.. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తాను దానిని సరి చేసేవాడు.. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే స్థాయిలో ఉన్నవాడు.. ఇక అతనే తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి.. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు వచ్చిన కొత్త సమస్య ఇది.. ఆస్తి పంపకాలలో ఇన్స్పెక్టర్ అయినా కొడుకు తప్పుగా వ్యవహరిస్తుంటే ఎవరికి చెప్పాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు
అదో దోపిడి గ్యాంగ్. హైవేలపై కాపు కాస్తుంది... దాబాల వద్ద మాటు వేస్తుంది...హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ట్రావెల్స్ బస్సులే టార్గెట్ గా రెక్కి నిర్వహిస్తుంది. ప్రయాణికులు బస్సులో నుంచి దిగగానే అందిన కాడికి దోచుకు వెళ్తారు. ఇది మధ్యప్రదేశ్ కంజర గ్యాంగ్ ముఠా పని. చోరీల్లో ఆరితేరిన ఈ గ్యాంగ్ ఆట కట్టించారు సంగారెడ్డి జిల్లా పోలీసులు.
హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులను హైడ్రా మొదలు పెట్టింది. గాజులరామారం చెరువును ఆక్రమించి నిర్మించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన చెరువుల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం విజయవంతంగా తొలగించారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలు మరింత మెరుగు పర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్.. జీవో Rt.No.345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5560 కోట్లు కేటాయించింది.