Pravasi Prajavani: గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి కౌంటర్.. వారిని రెండు రోజులు..
- గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం..
- ఇవాళ ఉదయం 10 గంటలకు మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో..
- ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pravasi Prajavani: ప్రజా భవన్ లో వారానికి రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాల్టి నుంచి గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి పేరుతో కౌంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే వారినికి రెండు రోజులు అంటే (బుధ, శుక్ర) వారాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 10.00 గంటలకు మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో కౌంటర్ తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొంటారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రజాభవన్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాభవన్ లో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో గల్ఫ్ లో వున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ఈకార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై పొన్న ప్రభాకర్ బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు.
Yamaha : కేవలం రూ. 2,999కట్టి ఈ కంపెనీ టూవీలర్స్ ఇంటికి పట్టుకెళ్లండి!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..