Home
Telangana
Telangana News
-
దేశంలోనే తొలిసారి.. మొబైల్ ఐసీయూ బస్సులు ప్రారంభం..
తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కరోనా రోగులకు సేవలు అందించడానికి ప్రత్యేక మొబైల్ యూనిట్లను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతలో 30 మొబైల్ ఐసీయూ బస్సులను హైదరాబాద్‌లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. మొదటి దశలో జిల్లాకు ఒకబస్సును కేటాయిస్తున్నామన్న మంత్రి.. త్వరలో జిల్లాకు రెండు బస్సుల చొప్పున పంపిస్తామన్నారు. ఇది వినూత్న ఆలోచన.. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం మొదటిసారి అని వెల్లడించారు. ఇక, వైద్యులను దేవుడితో సమానంగా చూస్తున్నారు.. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..… -
రేపు గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు, 7న దీక్షలు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడు సమావేశాలు అన్నీ జూమ్‌కు పరిమితం అయ్యాయి.. ఇక, ఇవాళ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జూమ్ లో సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. దీనిపై రేపు గవర్నర్ తమిళిసై ను కలిసి.. వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు.. జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలెక్టర్లను కలిసి వినతిపత్రం… -
యాదాద్రి బలాలయంలోకి చేరిన వర్షం నీరు
తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు రావడంతో భారీ వర్షం కురుస్తుంది. యాదగిరిగుట్టలో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోకి వర్షపు నీరు చేరింది. వాన నీటితో యాదాద్రి బాలాలయం చెరువును తలపిస్తోంది. అర్చకులు వర్షపు నీటిలో కూర్చుని పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షం పడటంతో బాలాలయం మునిగిపోయింది. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తుండటంతో తాత్కాలికంగా బాలాలయంలోనే నిత్య పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే ఎలా.. పార్టీ జైలు చుట్టూ తిరగాలా !
కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డిపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిని నాశనం చేసి.. కాంగ్రెస్ లోకి వచ్చాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇతర పార్టీ ల నుండి వచ్చిన వాళ్లకు పిసిసి ఇస్తా అంటే ఎలా.. పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే..పార్టీ జైలు చుట్టూ తిరగాలా? అని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు తనను తిట్టిన వాళ్ళు లేరు..మూడు,నాలుగు పార్టీలు మారిన వాళ్ళు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మీద… -
బిజేపికి షాక్ : మాజీ ఎంపీ వివేక్‌పై అసంతృప్తి నేతలు తిరుగుబాటు !
బిజేపిలోకి ఈటల వస్తున్నాడన్న వార్తతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈటల చేరికపై ఫుల్ బిజీగా ఉన్న తెలంగాణ బిజేపికి షాక్ తగిలింది. పెద్దపల్లి బిజేపిలో ముసలం నెలకొంది. మాజీ ఎంపీ వివేక్ పై అసంతృప్తి నేతలు తిరుగుబాటుకు దిగారు. ఈ రోజు మంచిర్యాలలో అసమ్మతి నేతలు సమావేశం కానున్నారు. వివేక్ తీరుపై మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్యెల్యేలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తదితర నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు… -
తెలంగాణా ఎంపీలకు చుక్కలు చూపిస్తున్న కిలాడీ.. ఫోన్ కాల్స్ రికార్డు చేసి మరీ !
ఈ మధ్య కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ లతో ఫోన్లు చేసి మరీ.. డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ కేటుగాళ్లు మామూలు ప్రజలనే కాదు.. రాజకీయ నాయకులను వదలడం లేదు. తాజాగా తెలంగాణలో పొలిటికల్ లీడర్లకు, పోలీసులకు నాగాపూర్ కు చెందిన ఫారీ కాద్రీ అనే వ్యక్తి చుక్కలు చూపెడుతున్నాడు. నేతల ఫోన్ రికార్డింగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ.. వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఫారీ కాద్రీ. ఇందులో… -
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో రెండు రోజులు పాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిమీ వద్ద ఏర్పడింది. గాలి విచ్చిన్నం తెలుగు రాష్ట్రాలపై సముద్ర మట్టానికి 1.5 కిమీ వరకు ఉంది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు బలపడ్డాయి. రానున్న 24 గంటల్లో ఈ ఋతుపవనాలు కర్యలలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలలో రాగల రెండు రోజులు… -
కరోనా భయంతో అడవిలోనే ఐసోలేషన్…
కరోనా వైరస్ కంటే, ఆ వైరస్ వలన కలిగే భయంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. కరోనా సోకితే మరణం తప్పదనే భయంతో దిగులు చెంది జీవనాన్ని కోల్పోయి ఇబ్బందు పడుతున్నారు. కరోనా నుంచ కోలుకోవాలి అంటే మొదట మానసికంగా బలంగా ఉండాలి. స్వచ్చమైన వాతావరణం ఉండాలి. అప్పుడు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సామాజికంగా వారికి పూర్తి భరోసా అందివ్వాలి. ఇక ఇదిలా ఉంటే, వైరస్ మహమ్మారి గ్రామల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో ప్రజల్లో భయాంధోళనలు… -
రేపే హైదరాబాద్‌కు ఈటల.. రాజీనామా అప్పుడే..!
ఊహించని పరిణామాలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది.. దీంతో.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికపై తర్జనభర్జన పడిన టీఆర్ఎస్ సీనియర్ నేత.. అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపారు.. చివరకు భారతీయ జనతా పార్టీ వైపే ఆయన మొగ్గు చూపారు.. ఢిల్లీలో మకాం వేసి మరి.. తనకు ఉన్న అనుమానాలను నివృత్తిచేసుకునే పనిలో పడ్డారు.. తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.. మొత్తంగా బీజేపీ అధిష్టానం నుంచి ఆయనకు సానుకూల పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. దీంతో.. రేపు ఉదయం… -
టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే…
టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు భట్టి విక్రమార్క. ఆరేళ్లలో ఆరు కోట్లు అప్పు చేసింది తెరాస. ఈటల నన్ను కలిసినప్పుడు జరుగుతున్న అవమానం పై అన్ని పార్టీల కలుస్తా అన్నారు. కేంద్రంతో రక్షణ పొందుదాం అని బీజేపీ లోకి కొందరు వెళ్తున్నారు. టీఆర్ఎస్ తో పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ కి ఫిర్యాదులు చేశాం. మా పిటిషన్ పెండింగ్ లో పెట్టీ..12 మంది పార్టీ…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!