తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,60,141 కి చేరింది. ఇందులో 5,18,266 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,706 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 23 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో…
ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ఇవాళ్టి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది… జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా ఇంటర్‌బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది. ఇక, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని..…
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్ ఆస్పత్రులు కనికరం చూపడంలేదు.. అందినకాడికి దండుకునే ప్రయత్నమే తప్పితే.. జాలిచూపే పరిస్థితిలేదు.. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్న ఆయన.. ఆంద్రప్రదేశ్,…
10 రోజుల తాత్కాలిక బ్రేక్ తర్వాత తెలంగాణలో ఇవాళ్టి నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైందే.. ఇక, ఇదే సమయంలో.. వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్‌వెజ్ మార్కెట్లు, కిరాణా…
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇచ్చినా.. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో నామమాత్రంగానే జరిగింది.. దీనికి వ్యాక్సిన్ల కొరతే ప్రధాన కారణంగా ప్రకటించింది సర్కార్.. అయితే, త్వరలోనే 18 ఏళ్లు పైబడినవారికి కూడా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది.. 10 రోజులు దాటిన తర్వాత ఇవాళ్టి నుంచి రెండో డోసును ప్రారంభించింది ప్రభుత్వం.. ఇక, 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని…
మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. అయితే ఈ లాక్ డౌన్ లో భారత సైనికులకు కష్టాలు ఎదురయ్యాయి. తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడ్డారు సైనికులు. అయితే ముంబయి నుండి హైదరాబాద్ మీదుగా బెంగుళూరు వెళుతున్న భారత సైనికులకు లాక్ డౌన్ కారణంగా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలలో మూత పడ్డ హోటళ్ళు ఎదురయ్యాయి. అయితే సైనికులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారనే…
సంగారెడ్డి జిల్లాలో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిచే విధంగా జిల్లాకు రావడం జరిగింది అని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఈ పాస్ లు, ఇతర రాష్ట్రాల ఈ పాస్ లు ఉన్న రాష్ట్ర సరిహద్దులోకి అనుమతి ఇస్తున్నాము. ఎలాంటి పని లేకుండా రోడ్లపై కి వస్తే కేసు నమోదు చేస్తాం, మళ్ళీ అదే విధంగా లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్ లు నమోదు చేస్తాం…
నిన్నటి తుఫాను యాస్ తీవ్రమై నిన్న రాత్రి తీవ్ర తుఫాను ‘YAAS'(యాస్)గా మారింది. ఈ రోజు ఉదయం 08:30 నిమిషాలకు పశ్చిమ & పరిసరాల్లోనే ఉన్న తూర్పుమధ్య & ఉత్తర బంగళాఖాతంలో కొనసాగుతూ, పరదిప్ కి దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిమి దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12గంటలలో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ, మరింత…
ఇండియాలో కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్…
కరోనా మహామ్మారిని ఎదుర్కోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మెడిసిన్ ఇప్పుడు సంచటనంగా మారగా, తెలంగాణలో మంథనీకి చెందిన గోశాల నిర్వాహకులు రమేష్ సరికొత్త ప్రయోగం చేశారు. అడవిలో తిరిగే అవుల నుంచి సేకరించిన ఆవుపేడ పిడకలు, నెయ్యి, ఆవాలు, కర్పూరం, పసుపు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పోగను గదిలో వేయడం వలన గదిలో ఉన్న కరోనా వైరస్ చనిపోతుందని, గాలిలో ప్రాణవాయువు పెరుగుతుందని…