కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నాం అని తెలిపారు. హుజూరాబాద్ నుండి సైదాపూర్ రోడ్డు కు అరు కోట్ల తో పనులు ప్రారంభం ఉన్నాయి. ఆరు సార్లు గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకు అభివృద్ది చేయలేదు. కరీంనగర్ లో వేసిన రోడ్ల లాగా హుజూరాబాద్ రోడ్లను అధునికరిస్తం అని…
అధికారపార్టీలో ఎమ్మెల్యేల జోడు పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? వరసగా ఇద్దరికి కీలక పదవులు కట్టబెట్టడంతో.. ఇతరులకు లైన్ క్లియరైనట్టేనా? ఆశలు వదిలేసుకున్నవారు మళ్లీ హుషారుగా ఎదురు చూస్తున్నారా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్యేలలో పదవులపై ఆశలు టీఆర్ఎస్లో కొంత కాలంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరుగుతోంది. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటికే పదవుల పొందిన వారిలో కొందరికి రెన్యువల్ అయితే.. కొత్త వాళ్లలో మరికొందరికి అవకాశం దక్కింది. ఎమ్మెల్యేలకు నామినేటెడ్…
ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అవసరం అయితే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. తెలంగాణ భవన్లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. మేం ప్రభుత్వoలో ఉన్నాం.. చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. కానీ, ప్రతిపక్షాలకు పని లేదు.. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు.. ఒకరేమో నేనున్నాని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జన సంఘ్ ఉందా..? అని ప్రశ్నించారు కేటీఆర్.. చరిత్రకు మతం…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. కేఆర్ఎంబీకి, కేంద్రానికి, జలశక్తిశాఖకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఇలా.. రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తూనే ఉన్నాయి.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది ఏపీ. ఇవాళ, కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి… కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోందన్న ఆయన.. వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం…
హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రకు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర.. ఓల్డ్‌సిటీ చార్మినార్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.. ఇక, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో గణనాథులు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తారు.. ఈసారి వినాయక నిమజ్జనానికి భారీ బందోస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం… వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు…
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 25,829 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,821 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 156.3860 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం…
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా… అలాగే ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ జలాశయానికి భారీ ఇన్ ఫ్లో వస్తుంది. అయితే శ్రీశైలం గేట్లు ఎత్తడంతో పెరిగిన వరద ఇప్పుడు తగ్గుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు కు 84,309 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుండటంతో,,, అవుట్ ఫ్లో కూడా 84,309 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 589.40 అడుగులకు…
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలమే రేపింది.. వారం రోజుల పాటు ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి.. అయితే, నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్యకు పాల్పడడంతో.. అంతా సద్దుమణిగింది.. అయితే, సింగరేణి కాలనీలో స్థానికులపై కేసు నమోదు చేశారు సైదాబాద్ పోలీసులు.. ఈ నెల 10వ తేదీన పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా చేసిన పలువురిపై కేసులు నమోదైంది… చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయంలో పోలీసులను అడ్డుకున్నారు స్థానికులు.. ఆ రోజు…
సీఎం కెసిఆర్ రాజకీయ జీవితం సమాధి చేస్తామని….కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి భయపడేది లేదని… అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పౌరుషం ఉంటే టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని… ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ను కేసీఆర్ మూడు ముక్కలు చేశారు, ఒక ముక్కను ఎంఐఎం కు ఇచ్చారని మండిపడ్డారు. విమోచన దినోత్సవాన్ని ఎందుకు…
రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి.. ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా… ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సిజే గా బదిలీ అయ్యారు. ఇక తెలంగాణ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తి నియామకం అయ్యారు. కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సిజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ ను తెలంగాణ సిజేగా బదిలీ అయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు తెలుగు…