K. Laxman: ధన్యవాద్ మోడీ పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయించిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహా సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధాని స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు నివేదిక రూపంలో ప్రజల ముందుకు రానున్నామని తెలిపారు.