తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణపై రెవెన్యూశాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ భూ భారతి చట్టం, 2025లోని సెక్షన్ 6, సబ్-సెక్షన్ (1) ప్రకారం నమోదుకాని లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Sub-Registrar Office : హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ఊహించని పరిణామంతో వార్తల్లో నిలిచింది. అధికారుల నిర్లక్ష్యం, ఆర్థిక అశ్రద్ధకు పరాకాష్టగా, ఏకంగా 40 నెలల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో కార్యాలయ భవన యజమాని తాళం వేయాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే, గత 40 నెలలుగా (సుమారు మూడున్నర సంవత్సరాలు)…
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ ( ఏఐ) సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Ponguleti Srinivas Reddy : ప్రజలకు మరింత మెరుగైన సేవల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునఃవ్యవస్థీకరణ చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు, మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. అవసరమైన భూములను…
Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. వర్షాలతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో భూములు, భూరికార్డులు కీలకమైనవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.