తెలంగాణలో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్ జనహితలో ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. వేడుకలకు మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వేదపండితులు సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించారు. పంచాంగ పఠనం ప్రారంభించిన బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి కొత్త సంవత్సరం ఎలా వుండబోతోంది అనేది వివరించారు. వేములవాడ రాజన్న ప్రభ మళ్ళీ వెలుగబోతుందన్నారు. ఈ సంవత్సరం ఎక్కువ మంచి జరగబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిపాలన అందిస్తారు. పంటలు అద్భుతంగా పండబోతున్నాయి.…