కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో ఆమె సంచలనం. ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో తమ రాజకీయ ప్రస్థానం గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. తాము పార్టీ మారడం లేదని కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చేశారు కొండా కపుల్. వరంగల్ తూర్పు మాదే..పార్టీ మరే ప్రసక్తే లేదు.. ఇది అంతా గిట్టని వల్ల ప్రచారం అంటూ కొట్టిపారేశారు. అత్యంత వైభవంగా జరిగిన కూతురు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా స్పష్టం చేశారు కొండా దంపతులు. వరంగల్ తూర్పులో కొండా…
1.దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు 2.ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్…
1.RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు…
1.ఏపీ అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభించారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. 2. సిరిసిల్ల పట్టణంలో కొనసాగుతున్న నేత కార్మికుల సమ్మెకు సంఘీభావం…
1.తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్…
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయంలో పోలీసులు ఇరుక్కుని పోయారు. ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చిన మాజీ కార్పోరేటర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈఘటనపై భార్య ఆందోళన చేస్తే ఆమె పట్ల పోలీసు అధికారులే దురుసుగా ప్రవర్తించారు. తన భర్తను ఏమి చేశారని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి ఆయన అనుచరులు తన భర్త పై కేసు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన ఆరోపిస్తోంది.…
టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చెక్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల్లో కోత విధించింది. ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. ఆయనకు గతంలో ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. జగ్గారెడ్డి కి అప్పగించిన బాధ్యతల్లో……
అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు. 2.దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది..…
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారు. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…
రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి బలమయిన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో బండి సంజయ్ అనేక అంశాలు ప్రస్తావించారు. రెండేళ్ళ పదవీకాలం చాలా సంతృప్తినిచ్చింది. అందరి సహకారం, నేతల సలహాలతో లక్ష్యాల వైపు అడుగులేశా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని అధికారంలోకి తెస్తాం. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో మేం గెలిచాం. టీఆర్ఎస్ డబ్బులు బాగా ఖర్చుపెట్టింది. నియోజకవర్గాలు అన్నింటిలో మేం పోటీచేశాం. మాకు నాయకులు తక్కువ…