TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది. ఎస్ఐ , తత్సమాన పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్షను నవంబర్ 29న.. అలాగే పీసీ , తత్సమాన పోస్టుల రాత పరీక్షను డిసెంబర్ 20న నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు.
వీటితో పాటు కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 7,437 ఖాళీల భర్తీ కోసం జూలై 29న నోటిఫికేషన్లు రాగా, ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ సారి ప్రభుత్వం వయస్సు సడలింపు ఇవ్వడంతో దాదాపు 1.13 లక్షల మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరింది. మొత్తం 4,29,000 మంది అభ్యర్థులు 5,77,064 దరఖాస్తులను సమర్పించారు. ఇందులో అత్యధికంగా 68 శాతానికి పైగా అభ్యర్థులు కేవలం ఒక్క పోస్టుకే దరఖాస్తు చేసుకున్నారు.
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
దరఖాస్తు చేసిన వారిలో పురుషులు 74 శాతానికి పైగా ఉండగా, మహిళా అభ్యర్థులు 25 శాతానికి పైగా ఉన్నారు. ఇక కేటగిరీల వారీగా చూస్తే బీసీ అభ్యర్థులు దాదాపు 49 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 శాతానికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను 97 శాతానికి పైగా అభ్యర్థులు విజయవంతంగా పూర్తి చేశారు. పూర్తి చేయని వారు సెప్టెంబర్ 30 లోపు తమ లాగిన్ ద్వారా దీన్ని పూర్తి చేసి పీడీఎఫ్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. పూర్తి వివరాలకు https://www.tgprb.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!