నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని.. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. దోమలపెంటలోని జె.పి గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.
Srisailam : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో మూడుమీటర్ల మేర పైకప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ పనులు జరగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం సంభవించింది. గమనించదగిన విషయం…
CM Revanth Reddy : నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి , రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ కు, రూ.296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ మద్దూర్…
మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరామమన్నారు. మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని…
పక్కింటావిడపై హత్యాయత్నం: వివాహేతర సంబంధం బయటపడుతుందన్న అనుమానంతో పక్కింట్లో నివాసం ఉంటున్న మహిళపై ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్యాయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణపర్తికి చెందిన పొలిమేర దీపిక పిల్లలతో కలిసి మునగపాక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కన రాజ్‌కుమార్, సరిత దంపతులు ఉంటున్నారు. అచ్చుతాపురంలో ఓ కంపెనీలో రాజ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. భర్త రాజ్‌కుమార్ డ్యూటీకి వెళ్లిన తర్వాత తన ప్రియుడిని సరిత ఇంటికి రప్పించుకుంటోంది.…
నేడు శ్రీశైలంలో 3వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంకాలం హంసవాహనంపై శ్రీస్వామి, అమ్మవారు పూజలందుకోనున్నారు. చికెన్, గుడ్లు వినియోగంపై ఫ్రీ చికెన్ మేళాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మేళాలు నిర్వహించనున్నారు. అపోహలను తొలగించడమే ఈ మేళాల లక్ష్యం. నేటి నుండి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొదటి పూజ స్వామి వారి ప్రథమ భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, 12:25 గంటలకు తిరిగి హెలికాప్టర్లో నారాయణపేట జిల్లా కేంద్రం సింగారంకు చేరుకుంటారు. సింగారన్‌లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.…
కేంద్ర జల్‌శక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు, పవన్ సమావేశం అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. మరోవైపు పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు…