గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఎవరు సారథ్యం వహించబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఒక బీసీ నేతను టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.