రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్యాలయం వద్ద 16 మంది కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్ స్టే విధించారు. ఫిబ్రవరి 16న అవిశ్వాస సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు రంగారెడ్డి కలెక్టర్ అనుమతిని సవాల్ చేస్తూ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. 30 రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస తీర్మానం…