తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో…
ఉప్పల్ నల్ల చెరువు వద్ద నిర్మించిన ‘ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్’ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం జలమండలి ఆధ్వర్యంలో నడిచే ‘డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్’ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. నాగరికమైన పద్ధతుల్లో పట్టణాల్లో ప్రజలు జీవించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో మన పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక…
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్న కేటీఆర్… కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కేటీఆర్ కోరారు. read also : అసత్య ప్రచారం చేస్తే నాలుక…
చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాల్క సుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ ను టీఆర్ఎస్ నేతలు పరామర్శిస్తున్నారు. కాగా రేపు మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మెట్ పల్లిలో బాల్క సుమన్ ను కేటీఆర్ పరామర్శించనున్నారు. అనంతరం కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో కూడా కేటీఆర్ పర్యటించనున్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి…
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. కాగా, తాజాగా జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సమ్మె చేసేందుకు ఇది సమయం కాదన్నారు. సమ్మె విరమించాలని అందరినీ కోరుతున్నా.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి…