తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ మహిళా ఉద్యోగులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్‌గా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది.