కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో…
థర్డ్ వేవ్ పై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మొదటి నుంచి చాలా శాస్త్రీయ పద్దతిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుందని… పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించింది. మళ్ళీ కొత్త రకం స్ట్రైన్, ఇంతకన్నా బలమైన వైరస్ స్ట్రైన్ వస్తే తప్ప మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. 8 నెలల తరువాత పాఠశాలల ప్రారంభం కానున్నాయని… తల్లిదండ్రుల్లో భయాలు ఉన్నాయని తెలిపింది. తక్కువగా విద్యార్థులు పాఠశాలలకు…