రియల్ ఎస్టేట్ సెక్టార్ లో నయా ట్రెండ్ నడుస్తోంది. ఇళ్లు, ప్లాట్లు సేల్ కాకపోవడంతో యజమానులు వినూత్నంగా ఆలోచించి లక్కీ డ్రా పద్దతికి తెరలేపుతున్నారు. లక్కీ డ్రా ద్వారా అమ్ముకునేందుకు రెడీ అవుతున్నారు. రూ. 500 నుంచి రూ. 1000 వరకు కూపన్లను విక్రయించి, డ్రాలో గెలుచుకున్న వారికి ఆస్తులు ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హల్ చల్ చేస్తోంది. నల్గొండకు చెందని రమేశ్ తన ఆరు గదుల ఇంటిని రూ. 999…