దేశవ్యాప్తంగా మతతత్వాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ దేశ సామాజిక సామరస్యాన్ని, సమగ్రతను నాశనం చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. వరంగల్ పట్టణంలోని కాజీపేటలో ప్రారంభమైన మూడు రోజుల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై మండిపడ్డారు. రాజకీయ మైలేజ్ పొందడం కోసం కాషాయ పార్టీ మతతత్వానికి ఒడిగట్టిందని అన్నారు. తమ ‘మత విభజన భావజాలాన్ని’ పెంచుకునేందుకు బీజేపీ సమాజాన్ని పోలరైజ్ చేస్తోందని ఆరోపించారు. హిందూ-సైనికీకరణను విశ్వసించిన వీర్ సావర్కర్ అడుగుజాడల్లోనే…
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. రెండు రోజుల నుంచి వానలు కాస్తు తగ్గుముఖం పడటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు.. రేపు గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి.. వరద పరిస్థితిని పరిశీలించనున్నారు. వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేసి, వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇందుకోసం కేసీఆర్ శనివారం రాత్రే వరంగల్ చేరుకున్నారు. భద్రాచలంకు రోడ్డు మార్గం ద్వారా సీఎం పయనమయ్యారు. రేపు సోమవారం వరంగల్ మీదుగా…