బండ్ల గూడలో డబల్ బెడ్‌రూమ్‌లు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబల్ బెడ్ రూమ్ సూపర్ వైజర్‌తో కుమ్మక్కైన మోసగాళ్లు ప్లాట్ బాధితులకు చూపించారు. 40 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికేట్‌లు తయారు చేసి డబల్ బెడ్ రూమ్ మంజూరు అయినట్లు సర్టిఫికేట్ క్రియేట్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. చెంచులకు 9200 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతంలో ఉండే నియోజక వర్గాలకు అదనంగా ఇస్తున్నామని వెల్లడించారు. 2 లక్షల 10 వేల ఇండ్లు అర్హుల జాబితా ఫైనల్ అయ్యిందని ప్రకటించారు. 24 వేల ఇండ్లు నిర్మాణం ప్రారంభం అయ్యిందని.. నిర్మాణానికి రూ. 130 కోట్లు చెల్లించామని తెలిపారు. పారదర్శకంగా అర్హుల ఎంపిక చేస్తున్నామని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న…
ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్‌ఛార్జి మంత్రులు ఆమోదం తప్పని సరి అని పేర్కొన్నారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో…
CM Revanth Reddy :అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని.. అర్హులనే ఎంపిక చేయాలని సీఎం అన్నారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని సీఎం రేవంత్…
Ponguleti Srinivas Reddy : తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా గడచిన పది సంవత్సరాలలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగారు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర…