Panchayat Elections Live Updates: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు భవితవ్యం తేలనుంది.
Jagtial District: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడని అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన గ్రామస్థులను కలచివేసింది. గ్రామానికి చెందిన పోతు శేఖర్ సర్పంచ్‌గా పోటీ చేశాడు. తమ్ముడు ఎలాగైనా గెలవాలని అక్క కొప్పుల మమత(38) తాపత్రయ పడింది. ఎన్నికల ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం కోరుట్ల నుంచి గ్రామానికి చేరుకుంది. నిన్న కౌటింగ్ జారుతుండగా తమ్ముడు వెనకంజలో ఉన్నాడని తెలుసుకుని అపస్మారక…
TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను…
TG Local Body Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 564 మండలాలకు చెందిన 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు దఫాల్లో ఓటింగ్ జరుగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని ప్రకటించారు. అయితే.. గ్రామ పంచాయతీ మోడల్ కోడ్, స్పష్టమైన నియమాల గురించి తెలుసుకుందాం..
Grama Panchayathi: గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.
Grama Panchayathi:గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. నేటితో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో గ్రామాల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.