ప్రభుత్వ ఉద్యోగమంటే.. పదోన్నతులు.. బదిలీలు కామన్. సమయం సందర్భాన్ని బట్టి అవి జరిగిపోతూ ఉంటాయి. తెలంగాణలో టీచర్లకు మాత్రం ఈ రెండు అంశాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. కొన్నేళ్లుగా గ్రహణం వీడటం లేదు. ఎందుకిలా? ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదా? లేక.. టీచర్ల వైపు నుంచి ఏదైనా లోపం ఉందా? పదోన్నతులు.. బదిలీలకు టీచర్లు దూరం..! తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆరేళ్లుగా పదోన్నతులు లేవు. మూడున్నరేళ్లుగా బదిలీలు బంద్. ఈ రెండు అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు పోరాటం…