లోక్ సభకు తెలంగాణ వరదల రచ్చ తాకింది. కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోతు వానలు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. దీంతో.. గోదావరి మహోగ్రంగా ఉప్పొంగడంతో గోదావరి తీరం అల్లకల్లోలమైంది. తెలుగురాష్ట్రాల్లో వందలాది గ్రామాలను గోదావరి వరద ముంచెత్తడంతో.. వేలాది మంది ఇళ్లు వదిలి పునరావాసకేంద్రాలకు వెళ్లిపోయారు. అయితే.. వరద మేనేజ్ మెంట్ లో తెలంగాణ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని, జాతీయ రాజకీయాలంటూ సమావేశాలు…