Telangana Governor Tamilisai Soudararajan Visit at Flood Areas.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా ఎగువన కురిసిన వర్షాలకు భారీ వరద వచ్చి చేరడంతో జలశయాల్లన్నీ నిండుకుండలా మారాయి. దీంతో పాటు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు నిండి కట్టలు తెగిపోయాయి. దీంతో వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరింది. వరదలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వరద బాధితులతో ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చానని, దత్తత తీసుకున్న గిరిజన ప్రాంతాల పరిస్థితి తెలుసుకున్నానన్నారు.
Etela Rajender : ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం
ముంపు గ్రామాలు సందర్శన చేశానని, అర్జీలు తీసుకున్నానన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలని కోరుతున్నారని, శాశ్వత పరిష్కారం గిరిజనులు కోరుతున్నారన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి సిబ్బందినీ ఇక్కడికి వచ్చి వైద్యం చేయాలని, కొందరు ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. ఇండ్లు కావాలని అడిగారని, వాళ్ళ ఫీలింగ్స్ ప్రభుత్వం కి చెప్తానన్నారు. నేను లోకల్ అడ్మినిస్ట్రేషన్ కి వ్యతిరేకంగా రాలేదని, లాంగ్ టర్మ్ పరిష్కారాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం కి చెప్తానన్నారు.