తాజాగా, నిన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త సెక్రటరీ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాక, ఒక హీరో గురించి ప్రస్తావిస్తూ, ఆయన చివరిగా నటించిన సినిమా థియేటర్లలో రెండు కోట్ల రూపాయలు కూడా రాబట్టలేదని, కానీ తర్వాత సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ హీరో ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.…
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్‌లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి చర్చించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-2025 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాత మరియు ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రవీంద్ర గోపాల్,…
థియేటర్లకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్లను కేవలం షేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా నడపాలని లేదా పర్సంటేజ్ పద్ధతుల ఆధారంగా నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ పూర్తిగా అసత్యమని, ఇటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని టీఎస్‌ఎఫ్‌సీసీ స్పష్టం చేసింది.
Film Nagar Cultural Center :ఫిలిమ్ నగర్ నడిబొడ్డున ఫిలిమ్ ఛాంబర్ కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ నాటికీ హైదరాబాద్ మహానగరంలో ఫిలిమ్ ఛాంబర్ ఓ ల్యాండ్ మార్క్ గా నిలచే ఉంది
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలంగాణా ఫిలిమ్ ఛాంబర్ కృతజ్ఞతలు తెలిపింది. సినిమా ప్రదర్శనదారులతో కలసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, కె.టి.రామారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఛీప్ సెక్రటరీ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ కు ఓ లేఖ రాస్తూ తమ అభ్యర్ధన మేరకు సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే సౌలభ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. పలు సమస్యల వల్ల థియేటర్లు మూతవేసుకునే పరిస్థితి వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం తమను ఆదుకునేందుకు ముందుకు…
తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దని నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌తో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు జులై చివరినాటికి థియేటర్లు తెరచుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని…