రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Npdcl, Spdcl తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకు…
CM Revanth Reddy : గ్రేటర్ హైదరాబాద్ సిటీ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్ట్ అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్ లో…