నేడు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమార్తె స్ఫూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.
ఒక వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయి.. మరో వైపు పచ్చదనం పెరిగింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రతిపక్షాలు తీసుకువస్తున్నారు.. మాకు అహంకారం లేదు....తెలంగాణ పై చచ్చెంత మమకారం ఉంది.. మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
మల్కాజ్ గిరి ఎన్నికల వ్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు మంత్రి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ వయస్సుకు మించి మాట్లాడుతున్నాడు.. ఇక్కడ మోడీని గూండా అని తిట్టి.. ఢిల్లీకి వెళ్లి ఆయన కాళ్లు పెట్టుకుంటావు.. బీజేపీతో మ్యాచ్ పికెటింగ్ చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం మరింత స్పీడ్ పెంచారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే పేరు గుర్తు ఉందా అని గ్రామాల్లో అడిగితే ఒక్కసారి కూడా కనపడలేదు అని అంటున్నారన్నారు. 14 ఏళ్లుగా గెలిచిన కేటీఆర్ కు సిరిసిల్లలో సొంత ఇల్లు…
ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ వాతావరణం బాగుండాలి.. ఖమ్మంలో ఆ పరిస్థితి లేదని, తాను మంత్రివర్గం నుంచి తప్పుకున్నాక పరిస్థితులు మారాయని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో పాల్గొన్నారు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే.. 3 రోజుల షెడ్యూల్ రిలీజ్ అయింది. 24, 25, 26 తేదీలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.