Minister KTR: ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు జేబీఎస్ నుంచి తూంకుంట వరకు స్కై వేలు ఏర్పాటు చేయాలని చూస్తున్నామని, అయితే కేంద్ర మంత్రులను కలిసి రక్షణశాఖ భూములను ఇవ్వాలని కోరితే, అందుకు అంగీకరించలేదని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ఈ స్కైవేలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా మరోవైపు ప్రముఖుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు వరుసగా తనిఖీలు నిర్వహిస్తుండడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
కరీంనగర్ అశోక్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఇదిగో నా అభివృద్ధి నివేదిక.. కరీంనగర్ ప్రగతి కోసం రూ. 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. గంగుల… నువ్వు సాధించేదేమిటి?’ అని ప్రశ్నించారు. ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్.. కోచింగ్ లేక బీసీ స్టడీ సర్కిల్ వెక్కిరిస్తోంది.. తీగల వంతెన వీక్లీ డ్యాన్స్ క్లబ్‌లా మారింది.. అంటూ ఎద్దేవా చేశారు. కబ్జాలు,…
Babu Mohan Emotional: కొడుకు పార్టీ మారడంపై బీజేపీ అభ్యర్థి, సినీ నటుడు బాబు మోహన్ కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తండ్రికొడుకులను విడదీసిందని ఆరోపించారు. తన పేరును బీఆర్ఎస్ రాజకీయంగా దుర్వినియోగం చేసి.. కుట్రతో గెలవాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తన కొడుకు పేరు ఉదయ్ భాస్కర్ అయితే.. ఉదయ్ బాబు మోహన్ అని ప్రచారంలో చెబుతున్నారని తెలిపారు. సిద్దిపేటకు…
జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆయన కుమారుడు చర్లకోల స్వరణ్ పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మారెడ్డికి అండగా ఉండి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో నీళ్లు జగన్ తీసుకెళ్లిండు, నిధులు మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ తీసుకెళ్లారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు.
TPCC Revanth Reddy: పార్టీ ఫిరాయించిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ను కూడా అసెంబ్లీ గేటు తాకనియోద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. కేసిఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఇసుకలో మేడిగడ్డ బ్యారేజి కట్టిన అవినీతి చరిత్ర కేసిఆర్‌ది.. కాంగ్రెస్‌కు పేరు వస్తుందని Slbc నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ 10…
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
Harish Rao: కాంగ్రెస్ నేతల మాటలు, కాంగ్రెస్ హమీలపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మూడు గంటలు కరెంట్ చాలన్న ఆయన నిన్న నారాయణఖేడ్ వచ్చాడని, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇస్తామని, ఆ రాష్ట్ర ఓటర్లను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ఉన్న గోచి ఊడిపోయిందని అన్నారు.