కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు.
తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రోజు మధ్యాహ్నం సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో అంజనీ స్థానంలో రవిగుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీ కుమార్‌తో పాటు ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌కుమార్ జైన్, మహేశ్ భగవత్‌కు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. డీజీపీ అంజనీ కుమార్‌ను ఈ రోజు మధ్యాహ్నం ఈసీ చేసింది.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీని 40 స్థానాల్లోపే పరిమిత చేసిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మహిళలు పోటీ చేయగా.. చాలా నియోజకవర్గాల్లో మహిళలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహారాణులెవరో తెలుసుకుందాం..
Young Candidates Won in Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. అధికార బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 సీట్లు (మ్యాజిక్ ఫిగర్ 60) కైవసం చేసుకోగా.. బీఆర్‌ఎస్ 39 సీట్లు గెలిచింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా.. ఎంఐఎం 7 సీట్లలో…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై 17,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంతో ఇక్కడ ‘శవయాత్ర’ తప్పింది. ప్రచారంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే హుజారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ తన శవయాత్రకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం చివరి రోజున పాడి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీ (బీజేపీ) ఖాతా తెరవలేదు. పోటి చేసిన ఇద్దరు ఎంపీలు పరాజయం పాలయ్యారు. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సైతం ఓటమి చెందారు. దాంతో మూడు చోట్ల రెండవ స్థానంతో కమల నాథులు సరిపెట్టుకున్నారు. కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోరాడి ఓడారు. వరుసగా మూడు సార్లు గంగుల చేతిలో ఓడిపోవడం విశేషం. కోరుట్ల నుంచి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి గెలిచారు. విజయం అనంతరం హుజురాబాద్ ప్రజలకు కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఈటెలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని.. కౌశిక్‌తో ఇలాగే ఉంటదన్నారు. ‘నా గెలుపుకు కారణమైన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు. ఈటెల రాజేందర్ ఇప్పటికైనా నోరు…
Bandi Sanjay Wants Re Counting in Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బండి సంజయ్.. రీకౌంటింగ్ కోరారు. దాంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కౌంటింగ్‌లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.…
BJP Winning candidates in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. దాంతో హ్యాట్రిక్ కొడదామని ఆశించిన బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు కూడా గెల్వలేకపోయింది. బీజేపీ అగ్ర నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులకు చుక్కెదురైంది. దాంతో తెలంగాణలో బీజేపీ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. బీజేపీ 8 చోట్ల గెలిచింది. ఈ లిస్ట్ ఓసారి చూద్దాం. 1 నిర్మల్…