Home
Telangana Education
Telangana Education News
-
Kishan Reddy : పేద విద్యార్థుల భవితకు భరోసా.. 4,741 మంది టెన్త్ విద్యార్థులకు ఫీజు చెల్లించిన కిషన్ రెడ్డి
ఆర్థిక ఇబ్బందులు ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు ఆటంకం కాకూడదనే సదుద్దేశంతో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, వారందరి పరీక్షా ఫీజులను స్వయంగా చెల్లించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4,741 మంది టెన్త్ విద్యార్థుల పరీక్షా ఫీజుల భారాన్ని ఆయన పూర్తిగా… -
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
నవభారత నిర్మాత, భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14న జరుపుకునే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని బాలబాలికలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలల పట్ల నెహ్రూకు ఉన్న అపారమైన ప్రేమ, వారి భవిష్యత్తుపై ఆయనకున్న దూరదృష్టి, విద్యాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. బాలలే దేశ సంపద, వారే భావి భారత పౌరులనే… -
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
తెలంగాణలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపుల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఖండించింది. నిబంధనలు పాటించిన కళాశాలలకే గుర్తింపు ఇస్తున్నామని, విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,241 జూనియర్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసినట్లు వెల్లడించింది. కార్పొరేట్ కళాశాలలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. మరో 12 కాలేజీలకు అనుమతులు 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 3,349 జూనియర్… -
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో పియుసి-1 (PUC-I) నుంచి ఇంజినీరింగ్ నాల్గవ సంవత్సరం (E4) వరకు చదువుతున్న విద్యార్థులందరికీ సవరించిన అకాడమిక్ షెడ్యూల్‌ను విశ్వవిద్యాలయ యాజమాన్యం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన అసాధారణ పరిస్థితులు, దసరా సెలవుల పొడిగింపు నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం , విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2026-27 విద్యాసంవత్సరం సెమిస్టర్-1కు సంబంధించి ఈ బ్లెండెడ్/హైబ్రిడ్ మోడ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. నూతన వర్కింగ్ ప్లాన్ ప్రకారం అక్టోబర్ 26,… -
Telangana SSC Exams : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే.?
తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న టెన్త్ (ఎస్ఎస్సీ), ఓఎస్ఎస్సీ , ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా విడుదల చేసింది. రెగ్యులర్ , వన్స్-ఫెయిల్ అయిన అభ్యర్థులు సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్లైన్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు) , ప్రిన్సిపాల్స్ తక్షణమే స్పందించి విద్యార్థులకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశాలు జారీ… -
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
తెలంగాణలో మార్చి 2027లో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారికంగా విడుదల చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ , ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. అలాగే, కాలేజీకి వెళ్లకుండా నేరుగా హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది.… -
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వియత్నాం విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అధికారుల బృందం వియత్నాంలో పర్యటించింది. జాయింట్ డైరెక్టర్ బి. వెంకట నరసమ్మ నేతృత్వంలో సాగిన ఈ పర్యటనలో ఆ దేశ విద్యావిధానం, బోధనా పద్ధతులు, డిజిటల్ విద్య అమలు తీరు వంటి పలు కీలక అంశాలపై లోతైన అధ్యయనం జరిగింది.… -
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
రాష్ట్రంలోని పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించింది. ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా రూ.204.40 కోట్ల మేర స్కాలర్షిప్ నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది విద్యార్థులకు సకాలంలో ప్రయోజనం చేకూరనుంది. అర్హులైన మొత్తం 32,976 మంది విద్యార్థులకు ఈ నిధులు నేరుగా అందనున్నాయి. దీనివల్ల విద్యార్థుల ఫీజు చెల్లింపులు , ఇతర విద్యాపరమైన అవసరాలు సులభంగా నెరవేరుతాయని ప్రభుత్వం స్పష్టం… -
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, అభ్యసన ఫలితాలు మెరుగుపరచడమే లక్ష్యంగా అంతర్జాతీయ అధ్యయన పర్యటనలను నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 2025 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో ఫిన్లాండ్ (ఏప్రిల్ 2026), జపాన్ (సెప్టెంబర్ 2026), సింగపూర్ (సెప్టెంబర్ 2026లో రెండు విడతలు) దేశాలకు విజయవంతంగా అధ్యయన బృందాలను పంపిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా 5వ విడతగా విద్యాశాఖలోని 40 మంది ఉపాధ్యాయులు, అధికారులతో… -
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడం, మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (DIEOs) , ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కళాశాలల్లో బోధనా పద్ధతులు, పరిపాలనాపరమైన అంశాలు, విద్యార్థుల సంక్షేమంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అప్డేట్ చేసిన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
-
Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
-
Gopichand: విలన్‌గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
-
IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..