Warangal: వరంగల్‌లో మొంథా తుఫాన్ బీభత్సానికి 6465 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండ ప్రాంతం కాజీపేట సర్కిల్ కార్యాలయం పరిధిలో 4150.. వరంగల్ ప్రాంతంలోని కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో 2315 నివాస గృహాలు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.. అధికారులు ఈ సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. వరంగల్ ప్రాంతం కంటే హనుమకొండ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో ఇళ్లతో పాటు రహదారులు ఎక్కువగా…
ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని (SDRF) ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర హోం శాఖ నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 2,000 మంది సిబ్బందితో అగ్నిమాపక శాఖ పర్యవేక్షణలో SDRF ఏర్పాటు చేయబడింది.