BRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. “అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో” అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు.…