Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు.
ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ స్థానిక ఎన్నికలపైనా సీఎం చంద్రబాబు నేతలతో చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా టీడీపీ కూడా దూకుడు పెంచింది. Also Read: Vizag CP: అందుకే.. వైఎస్ జగన్…
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.