ఇవాల్టితో తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి.. మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక మూడో రోజు సైతం ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే కేంద్ర విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ రెండు తీర్మానాలను ప్రవేశపెడతారు. వాటిపై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఇక శాసనసభలో ఏడు బిల్లులపై చర్చించి ఆమోదం తెలియజేస్తారు. ఆ…