Harish Rao: బీజేపీ మాటలు నీటి మీద రాతలని.. అందుకే ఆ నలుగురు పార్టీకి టాటా చెప్పారని మంత్రి హరీష్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటనలో మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తరపున హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Vijayashanthi: బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి త్వరలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారులోని నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు.
Minister KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రచారం కింద బీఆర్‌ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
Revanth Reddy: ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రతిరోజు కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్న ఈ ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో ఉత్సాహాన్ని పెంచుతోంది.
CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ స్టేషన్‌ఘన్‌పూర్‌కు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్-వరంగల్ హైవేలోని మేడికొండ క్రాస్ రోడ్డు వద్ద శివారెడ్డిపల్లి శివారులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Yogi Adityanath: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 30న ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగం పెంచాయి.
Hyderabad Police Caught Huge Cash: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో పోలీసులు, ఎన్నికల అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కోట్లలో రూపాయలు, కేజీల కొద్ది బంగారం, వెండి బయట పడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తనిఖీ చేపట్టిన పోలీసులు ఆరున్నర కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని అప్పా జంక్షన్ వద్ద శనివారం పోలీసులు తనిఖీ చేశారు. ఈ…
మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి వేసిన నామినేషన్లో తప్పులు ఉన్నాయని, ఈ విషయాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని అతను కోర్టు కోరారు. ఇక దీనిపై శనివారం విచారణ చేపట్టగా.. ఆఫిడవిట్‌లోని అభ్యంతరాలపై ఫిర్యాదు దారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్టు ఎన్నికల కమిషన్ తరపు…
MLC Kavitha: జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్ళు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా