Vijayashanti: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇక 7 రోజులే సమయం ఉండటంతో పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈనెల 26న ప్రచారం చేసేందుకు ఈసీ డెడ్ లైన్ విధించింది.
Minster KTR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిద్దిపేటలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దుబ్బాక నుంచి రోడ్డు మార్గంలో ముస్తాబాద్ చేరుకుంటారు.
IT Raids In Viveka Houses: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ ఎన్నికల బరిలో నిలిచారు.
CM KCR: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వైరా, మధిర అభ్యర్థుల తరపున ప్రజా ఆశీర్వాద సభలు, ప్రచారంలో పాల్గొంటారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ళ బిఅర్ఎస్ ప్రభుత్వం.. నీళ్లకి నికరం లేదు, కన్నీళ్లకు కనికరం లేదు,నిధులు గులాబీ గదుల నిండా, నియామకాలు ఒక కెసిఅర్ కుటుంబం పండగలా అయ్యందని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ మీడియా విభాగం ఇంచార్జీ చేతన్ గోనాయక్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చిన్న గారి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేఎల్‌ఆర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతన్…
BJP Delhi Leaders Telangana Tour: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నిర్మల సీతారామన్, దేవేంద్ర ఫడ్నవిస్‌లు ఇక్కడి బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఒక్కొక్కొ రోజు ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వారి షెడ్యూల్‌ను ప్రకటించారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రధాని మోదీతో సహా…
బీజేపీకి ఓటు వేసినా.. మోరిలో ఓటు వేసిన ఒకటే అని ఆర్థిఖ శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం గజ్వేల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఈటెల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టారని, అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టిండని మండిపడ్డారు. ఈటెలను ఎమ్మెల్యే చేసింది, మంత్రిని చేసింది.. శాసన సభ పక్ష లీడర్‌ను చేసింది సీఎం కేసీఆర్ అని గుర్తు…
ఈనెల 25న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ-జనసేన నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు 2జీ, 3జీ, 4జీలు.. బీజేపీ 2జీ, 3జీ, 4జీ కాదు తెలంగాణ ప్రజల పార్టీ అని అమిత్ షా అన్నారు. మోడీ కృషితోనే చంద్రాయన్ విజయవంతం అయింది.. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని విధానంగా బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు.
నర్సాపూర్ లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చీమలు బారులు తీరినట్లుగా ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన మీకు అభినందనలు.. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు.