తుమ్మిడి కుంట చెరువుకు మరోవైపు ఉన్న తాత్కాలిక నిర్మాణాలను కూడా భారీ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను సైతం వరుసగా కూల్చి వేస్తున్నారు. అక్రమంగా చెరువు స్థలంలో బోర్లు వేసి అక్రమార్కులపై కూడా అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అందులో ఉన్న వారితో పాటు…వారిని రక్షించేందుకు…బావిలోకి దిగిన గజ ఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. శాయశక్తుల కష్టపడి.. బావిలో పడిన కారును బయటకు తీసే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. ఆరు గంటలు శ్రమించి… చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన గజ ఈతగాళ్లు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి. మెదక్…