తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బదనాం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనయ్ అన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉందని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మానసిక క్షోభకు…