ఇటీవల ఎపి ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఢల్లీిలో పర్యటించి కేంద్ర పెద్దలను కలసి వచ్చాక పాలనావికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల హడావుడి బాగా పెరిగింది. హోంమంత్రిఅమిత్‌షాను కలుసుకున్నప్పుడు ఇచ్చిన మెమోరాండంలో మొదటి అంశమే పాలనావికేంద్రీకరణ కావడం యాదృచ్చికం కాదు..దీనిపై ఢల్లీిపెద్దలు ఏ రూపంలోనూ ఎలాటి అభ్యంతరంగాని భిన్నాభిప్రాయం గాని వెలిబుచ్చలేదు సరికదా ముందుకు పొమ్మని పచ్చజెండా వూపినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుతో మొదలు పెట్టి వివిధ విభాగాలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు…