స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఓడిపోయింది. టెస్టు చరిత్రలో భారత గడ్డపై రెండో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది. దీనికి కారణం స్పిన్‌లో మనోళ్లు తేలిపోవడమే. స్వదేశంలో స్పిన్ పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడం టీమిండియాకు అలవాటు. ఇప్పుడు మన బలమే బలహీనతగా మారింది. మన స్పిన్ ఉచ్చు మన మెడకే చుట్టుకుంటోంది. దాంతో రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ స్పందించాడు.…